Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కోహ్లీ అహంకారిగా కనిపించడానికి కారణం అదే.. అసలు విషయం బయటపెట్టిన డివిలియర్స్‌

Virat Kohli appeared arrogant for this reason AB de Villiers reveals truth
Advertisement
  • కోహ్లీని తొలిసారి కలిసినప్పుడు అహంకారిగా భావించానన్న డివిలియర్స్‌
  • కోహ్లీ ఆత్మవిశ్వాసమే అలా కనిపించడానికి కారణమని వెల్లడి
  • 19-21 ఏళ్ల వయసులో కోహ్లీ చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడని వ్యాఖ్య
  • కాలక్రమంలో కోహ్లీ వ్యక్తిత్వంలో పరిణతి వచ్చిందన్న డివిలియర్స్‌
  • చిన్న వయసులో తనను నిరూపించుకోవాలనే తపన ఎక్కువగా ఉండేదని వెల్లడి
Advertisement
టీమిండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీపై దక్షిణాఫ్రికా మాజీ ఆటగాడు ఏబీ డివిలియర్స్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తొలిసారి కలిసినప్పుడు కోహ్లీని అహంకారిగా, మితిమీరిన ఆత్మవిశ్వాసం ప్రదర్శించే వ్యక్తిగా భావించానని వెల్లడించాడు. అయితే, అది అతడి వ్యక్తిత్వంలోని మరో కోణమని, తన సామర్థ్యంపై ఉన్న బలమైన నమ్మకమే అలా కనిపించడానికి కారణమని వివరించాడు. కాలక్రమంలో కోహ్లీ వ్యక్తిత్వంలో మార్పు వచ్చిందని తెలిపాడు.

ప్రఖర్‌ గుప్తాతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో డివిలియర్స్‌ ఈ విషయాలను పంచుకున్నాడు. తొలిసారి కలిసినప్పుడు కోహ్లీని నిజంగానే ‘అహంకారి, పొగరుబోతు’గా భావించారా? అని అడగ్గా.. "అవును, కోహ్లీ కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తాడు" అని సమాధానమిచ్చాడు. అయితే, తాను ఆ మాటలను సరదాగానే చెబుతుంటానని స్పష్టం చేశాడు.

19 నుంచి 21 ఏళ్ల వయసులో కోహ్లీ చాలా ఆత్మవిశ్వాసంతో ఉండేవాడని డివిలియర్స్‌ పేర్కొన్నాడు. తన సామర్థ్యంపై గట్టి నమ్మకం ఉండటమే అతడిని అలా చూపించిందని చెప్పాడు. కొన్నిసార్లు అలాంటి ఆత్మవిశ్వాసాన్ని ఇతరులు అహంకారంగా పొరబడతారని వివరించాడు. గొప్ప విజయాలు సాధించాలంటే తనపై తనకు నమ్మకం ఉండటం అవసరమని అభిప్రాయపడ్డాడు.

విరాట్‌ కోహ్లీతో డివిలియర్స్‌కు మైదానం బయట కూడా మంచి అనుబంధం ఉంది. ఐపీఎల్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (ఆర్‌సీబీ) తరఫున కలిసి ఆడిన సమయంలో వీరిద్దరి స్నేహం మరింత బలపడింది. అప్పటి నుంచి కోహ్లీ ఆటతీరుతో పాటు అతడి వ్యక్తిత్వాన్ని కూడా డివిలియర్స్‌ మరింతగా అభిమానిస్తూ వచ్చాడు.

కోహ్లీ ఎదుగుతున్న కొద్దీ అతడిలోని ఆ అతివిశ్వాస భావన తగ్గిందని డివిలియర్స్‌ తెలిపాడు. వయసుతో పాటు వ్యక్తిగా, క్రికెటర్‌గా మరింత పరిణతి సాధించాడని చెప్పాడు. చిన్న వయసులో తనను తాను నిరూపించుకోవాలనే తపన కోహ్లీలో ఎక్కువగా ఉండేదని, విజయాలు సాధించే కొద్దీ ఆ అవసరం తగ్గిందని వివరించాడు. తనపై నమ్మకాన్ని ఇతరుల ముందు అతిగా ప్రదర్శించాల్సిన అవసరం కూడా క్రమంగా తగ్గిపోయిందని పేర్కొన్నాడు.
Advertisement
Advertisement
Virat Kohli
AB de Villiers
Royal Challengers Bengaluru
Virat Kohli personality
IPL news
Cricket maturity

More Telugu News